బిజినెస్

7.7 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: భారత జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గత ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే స్వల్పంగా పెరిగి 7.7 శాతంగా ఉండొచ్చని ఎన్‌సిఎఇఆర్ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగానే కురుస్తాయని చెప్పడమే దీనికి కారణంగా ఆర్థిక విశే్లషణల దిగ్గజం ఎన్‌సిఎఇఆర్ పేర్కొంది. దేశ వ్యవసాయ రంగం వర్షాధారమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండేళ్ళుగా సాధారణం కంటే తక్కువగా కురిసిన వర్షాలతో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా పడతాయన్న అంచనాలు నిజమైతే దేశ జిడిపి వృద్ధి పురోగమించగలదని ఎన్‌సిఎఇఆర్ అభిప్రాయపడింది. ఇదిలావుంటే నిరుడుతో పోల్చితే ఈ ఏడాది ఎగుమతుల వృద్ధి (-) 1.6 శాతం, దిగుమతుల వృద్ధి (-) 0.6 శాతంగా ఉంటాయంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 0.9 శాతంగా, జిడిపిలో కరెంట్ ఖాతా లోటు (-) 1 శాతంగా, ద్రవ్యలోటు 3.5 శాతంగా నమోదు కావచ్చంది. కాగా, 1956లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) ఏర్పాటైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విధానపరమైన అవకాశాల కోసం దీన్ని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆదేశాలతో ప్రారంభించారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక స్థితిగతులనూ ఎన్‌సిఎఇఆర్ అంచనా వేస్తోంది.