బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘కొరియా’ కొరివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: ముంబయి స్టాక్ మార్కెట్లో సోమవారం ఉత్తర కొరియా వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ధిక్కరించి భూగర్భంలో హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన ప్రభావ ఫలితంగా సెనె్సక్స్ కుదుపునకు లోనైంది. గత మూడు రోజులుగా లాభాల బాటలో పయనించిన భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. సెనె్సక్స్ ఏకంగా 190 పాయింట్లు పడిపోయింది. కేవలం భారత స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా ఆసియా ఖండంలోని దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లు కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష తీవ్రస్థాయిలో ఆందోళనలు రేకెత్తించింది. అన్ని మార్కెట్లలోనూ షేర్లను తెగనమ్ముకునే పరిస్థితి కనిపించింది. ఐరోపా దేశాల మార్కెట్లు కూడా తీవ్రస్థాయిలో అలజడికి గురయ్యాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 189.98 పాయింట్లు (0.60 శాతం) నష్టపోయి 31,702.25 పాయింట్లకు చేరుకుంది. నేటి ఉదయం నుంచి జరిగిన లావాదేవీల్లో నిఫ్టీ ఒక దశలో 9,900 దిగువకు చేరుకుంది. అయితే మధ్యలో కొంత కోలుకుని 61.55 పాయింట్లు కోల్పోయి 9,912.85 వద్ద ముగిసింది. మదుపుదారులంతా లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇచ్చారని, బంగారం, వెండి, ట్రెజరీ ఫ్యూచర్స్, జపాన్ యెన్‌లపైనే దృష్టి పెట్టారని వ్యాపారవేత్తలు తెలిపారు. భారత మారకమైన రూపాయి కూడా మొదట్లో పుంజుకున్న లాభాన్ని కోల్పోయి కొంతమేరకు పతనమైంది. ముఖ్యంగా విదేశీ మారకద్రవ్యంపై జరిగిన లావాదేవీల నేపథ్యంలో అమెరికా మారకద్రవ్యమైన డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మరింత తగ్గింది. భారీగా నష్టపోయిన వాటిలో అదానీ పోర్ట్స్ షేర్ ఉంది. ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనీ లీవర్ సూచీలు 2.6 నష్టపోయాయి.