బిజినెస్

8 నుంచి మాదాపూర్‌లో ఇండస్ట్రియల్ ఎక్స్‌పో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ఈనెల 8 నుంచి హైటెక్‌సిటీ మాదాపూర్‌లో మూడవ ఇండస్ట్రియల్ ఎక్స్‌పో జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఎఫ్‌టిఏపిసిసిఐ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్‌పోను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ఉ.గం. 11:00 నుంచి సా.గం. 7:00ల వరకు తెరచి ఉంటుంది. ఈ ప్రదర్శనలో స్థానిక పరిశ్రమలు అత్యాధునిక టెక్నాలజీ, నెట్ వర్కింగ్ సిస్టంను ఎక్స్‌పోజ్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని ఇండస్ట్రియల్ ఎక్స్‌పో మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ ఎక్స్‌పోలో ఉత్పత్తులు, సరఫరా వంటివి ఉంటా యి. ఈ ప్రదర్శన హైదరాబాద్ పరిశ్రమల ఉత్పత్తిదారులకు మంచి అవకాశమన్నారు. మల్టిసిటీ ఎగ్జిబిషన్‌లో భాగంగా జరిగే ఎగ్జిబిషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఇలాంటి ప్రదర్శన కోల్‌కట, జైపూర్, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్‌పూర్, నాగపూర్, నాసిక్, ఔరంగాబాద్‌లలో నిర్వహించినట్టు రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.