బిజినెస్

కాకినాడ తీరంలో పెట్రోకెమికల్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 5: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల వౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలుచేపట్టింది. ఎపి పెట్రోకెమికల్ ప్రాజెక్టును గెయిల్, హెచ్‌పిసిఎల్, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంయుక్తంగా ఏర్పాటుచేయనున్నాయి. ఈ ఏడాది జనవరి 27,28 తేదీల్లో విశాఖలో జరిగిన 2వ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇనె్వస్ట్‌మెంట్ మీట్‌లో భాగంగా కాకినాడ తీరంలో ఎపి పెట్రోకెమికల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-గెయిల్, హెచ్‌పిసిఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ప్రభు త్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాల్లో కాకినాడ తీరంలో వస్తున్న ఏకైక పరిశ్రమ ఇదే. ఈనేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు కాకినాడ ఎస్‌ఇజడ్ పరిధిలో రెండు వేల ఎకరాల భూమిని గుర్తించారు.
అలాగే ఈ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగుల కోసం టౌన్‌షిప్ అభివృద్ధికి మరో 150 ఎకరాలు ఎస్‌ఇజడ్‌లో కేటాయించారు. పెట్రోకెమికల్ ప్రాజెక్టుకు ముడి సరుకుల దిగుమతి, ఎగుమతి, నిల్వ, తదితర వసతుల కోసం మరో 100 ఎకరాలను కాకినాడ పోర్టు పక్కనే కేటాయిస్తారు. ఈ ప్రాజెక్ట్‌కు కావల్సిన విద్యుత్‌ను 33కెవి/ 132కెవిని పిఠాపురం సబ్ స్టేషన్ నుండి కేటాయించాలని, ప్రాజెక్ట్ ఉద్పాదక కార్యక్రమాలకు కావల్సిన 210 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం 60 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా 400 కెవిఎ సబ్-స్టేషన్ నెలకొల్పాలని నిర్ణయించారు.
ఈమేరకు కాకినాడలో మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో గెయిల్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ అశ్విన్‌కుమార్ గుంబర్, హెచ్‌పిసిఎల్ జిఎం అభిషేక్ త్రివేది తదితరులు సమావేశమై, పెట్రోకెమికల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, సదుపాయాల పట్ల హర్షం వ్యక్తంచేశారు. త్వరలో ఈ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని వారు ప్రకటించారు.