బిజినెస్

ఫార్మా, ఎరువుల రంగమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన వృద్ధి యంత్రాలుగా ఎరువులు, ఫార్మా, రసాయన ఫార్మాస్యూటికల్ రంగాలు పనిచేస్తున్నాయని, వీటి మొత్తం టర్నోవర్ 13.5 లక్షల కోట్ల రూపాయలని రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంలో ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైన భూమిక పోషిస్తోందని తెలిపారు. ఇందులో ఎరువుల రంగం 18.67 శాతం వృద్ధి రేటును, ఫార్మా రంగం 13.5 శాతం వృద్ధిని, రసాయనాలు, ఫార్మాస్యూటికల్ రంగం 11-12 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ మూడు రంగాలు కూడా కీలకమైన వృద్ధి యంత్రాలుగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. తన మంత్రిత్వ శాఖ కోట్లాది ఉద్యోగాలను కల్పిస్తోందని వెల్లడించిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ఈ మంత్రిత్వశాఖ విజయాలను ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే భారత రాష్టప్రతి కూడా తన ప్రసంగంలో ఈ మంత్రిత్వశాఖ ప్రాధాన్యతను ప్రస్తావించారని వెల్లడించారు. గత మూడు సంవత్సరాల కాలంలో తాము సాధించిన విజయాలను ఏకరువు పెట్టిన అనంతకుమార్ దాదాపు 1100 మందుల రేట్లను గణనీయంగా తగ్గించామని, అలాగే స్టంట్లు, మోకాలి ఇంప్లాంట్ల ధరలు కూడా అందరికీ అందుబాటులో వచ్చే రీతిలో తగ్గినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో మందులను సరఫరా చేయడానికి 2400 ఔషధీ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఇక రసాయన రంగానికి సంబంధించి యూరియా, ఇతర పోషకాల సరఫరాకు ప్రాధాన్యతను ఇస్తున్నామని, దీని ఉత్పత్తిని కూడా పెంచినట్లు ఆయన వెల్లడించారు.