బిజినెస్

కర్నూలులో ఉల్లి రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 8: ఉల్లిగడ్డ ధర ఒక్కసారిగా పడిపోవడంతో కర్నూలులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు ఉల్లి ధర శుక్రవారం 400 రూపాయలే పలకడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉల్లిగడ్డల్ని రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని కోడుమూరు, గూడూరు, పత్తికొండ, వెల్తుర్తి, ఉల్లిందకొండ, బేతంచర్ల తదితర ప్రాంతాల నుండి రైతులు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లి తరలిస్తున్నారు. అయితే ఏరోజుకారోజు వేలం పాడకుండా ఐదారు రోజులకు ఒకసారి వేలం పాటలు నిర్వహిస్తుండడంతో ధర తగ్గి తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. పంట సాగుకు ఎకరాకు 60 వేల నుండి 70 వేల రూపాయలదాకా ఖర్చు అవుతోందని, ధరలు బాగా తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. శుక్రవారం అమాంతం 400 రూపాయలకు పడిపోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో మార్కెట్ అధికారులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది ఫలితం లేకుండా పోయింది. అయతే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 2 వేల రూపాయలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

చిత్రం..ధరలు అనూహ్యంగా క్షీణించడంతో శుక్రవారం కర్నూలులో రోడ్డుపై
ఉల్లిగడ్డలు పారబోసి ఆందోళన చేస్తున్న రైతులు