బిజినెస్

భారీగా తగ్గిన హార్లే డేవిడ్‌సన్ బైక్‌ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్.. రెండు మోడల్స్‌పై భారీ స్థాయిలో ధరలను తగ్గించింది. ఫ్యాట్ బాయ్, హెరిటేజ్ సాఫ్‌టెయిల్ క్లాసిక్ 2017 ఎడిషన్స్ ధరలను 2.5 లక్షల రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఫ్యాట్ బాయ్ ధర 17,01,000 రూపాయల నుంచి 14,99,990 రూపాయలకు దిగిరాగా, 2,01,010 రూపాయలు తగ్గింది. అలాగే హెరిటేజ్ సాఫ్‌టెయిల్ క్లాసిక్ ధర 18,50,000 రూపాయల నుంచి 15,99,990 రూపాయలకు పడిపోగా, 2,50,010 రూపాయలు దిగివచ్చింది. ఈ ఏడాది మోడల్స్‌పైనే ఈ తగ్గింపు ఉంటుందని, ఈ నెల 1 నుంచే తగ్గింపు వర్తిస్తుందని ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. అలాగే స్టాక్స్ ఉన్నంతవరకే తగ్గింపు చెల్లుబాటు అవుతుందని కూడా పేర్కొంది.