బిజినెస్

ఆ బాధ్యత ఆటో సంస్థలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాల వినియోగాన్ని పెంచే బాధ్యత ఆటో రంగ సంస్థలపైనా ఉందని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. వాతావరణంలో ప్రమాదకర స్థాయికి చేరిన వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. అలాగే పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ఆధారిత వాహన వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయాలని ఆటో రంగ సంస్థలకూ సూచిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇక్కడ జరిగిన ఆటోమోటివ్ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 57వ వార్షిక సదస్సులో పాల్గొన్న భార్గవ.. వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడేలా వాటిని ఆకర్షణీయంగా రూపొందించాలని, అలా జరిగితే వాటి వినియోగం పెరుగుతుందన్నారు.