బిజినెస్

సంస్కరణల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. మదుపరులు సంస్కరణల జోష్‌లో ఉండగా, వరుస రెండు వారాల నష్టాల నుంచి సూచీలు తేరుకున్నాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివాలా బిల్లు ఆమోదం పొందడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూర్చిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికోత్పత్తి పడిపోయినా, రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినా మదుపరులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఫలితంగానే అంతకుముందు రెండు వారాలు నష్టాల్లో కదలాడిన సూచీలు.. గడచిన వారం లాభాలను అందుకోగలిగాయని వారు విశే్లషిస్తున్నారు. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధికిగాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు గత మూడు వారాలుగా తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుండగా, మార్కె ట్లు లాభాలను అందుకున్నది మాత్రం గడచిన వారమే. గడచిన వారం ట్రేడింగ్ సరళిని చూస్తే సోమవారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఆలస్యమన్న సంకేతాలతో లాభాలురాగా, మంగళవారం ఆ లాభాలు కొనసాగాయ. బుధవారం మాత్రం మారిషస్‌తో పన్ను ఒప్పం దాల సవరణతో నష్టాలు రాగా, గురువారం దివాలా బిల్లు ఆమోదం తో మళ్లీ లాభాలు వచ్చాయ. శుక్ర వారం పి-నోట్ల నిబంధనల కఠినత రంతో తిరిగి నష్టాలు వాటిల్లాయ. ఇక బ్యాంకింగ్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, రియల్టీ రంగాల షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగాల షేర్ల విలువ 2.70 శాతం నుంచి 0.33 శాతం పెరిగింది. అయితే మెటల్, చమురు, గ్యాస్, ఆటో రంగాల షేర్ల విలువ 2.21 శాతం నుంచి 0.27 శాతం తగ్గింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.74 శాతం, స్మాల్-క్యాప్ 1.96 శాతం చొప్పున పుంజుకున్నాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 12,550.76 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 85,455.02 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ 11,976.50 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 78,673.03 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.