బిజినెస్

రూ. 50 లక్షల బతుకమ్మ చీరల నిల్వలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 9: నిలిపివేసిన బతుకమ్మ చీరల సేకరణకు ఎట్టకేలకు విముక్తి లభించింది. దీంతో సిరిసిల్లలో ఈ చీరలను ఉత్పత్తి చేస్తున్న మరమగ్గాల మ్యాక్స్ సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. సిరిసిల్లలో మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలను ఖరీదు చేయడానికి ఈ నెల 5వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. అయితే చీరల ఉత్పత్తి కొనసాగుతున్న నేపథ్యంలోనే డెడ్ లైన్ ముగిసిపోవడంతో ఉత్పత్తి అయిన బతుకమ్మ చీరలను ఖరీదు చేయడానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా పట్టణంలోని మరమగ్గాల పారిశ్రామికుల వద్ద సుమారు 50 లక్షల రూపాయల విలువ గల చీరల నిల్వలు ఆగిపోయాయి. దీంతో వీరు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మ్యాక్స్ సంఘాలు రాష్ట్ర మంత్రి కె తారకరామారావుకు మొరపెట్టుకున్నాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్ శనివారం చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌కు సూచనలు చేస్తూ, ఉత్పత్తి అయన సుమారు 40 లక్షల నుండి 50 లక్షల రూపాయల మేర విలువ గల బతుకమ్మ చీరలను ఖరీదు చేయాలని తెలిపారు. మంత్రి సూచనలతో ఖరీదు చేయకుండా ఆపివేసిన చీరలను ఖరీదు చేయాలని సిరిసిల్ల చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు అశోక్‌రావును శైలజా రామయ్యర్ ఫోన్‌లో ఆదేశించినట్టు ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి వెల్లడించారు. ఆగిన చీరల ఖరీదుకు చర్యలు చేపట్టి, ఇక్కడి మరమగ్గాల పారిశ్రామికులను ఆదుకున్న మంత్రి కెటిఆర్‌కు సిరిసిల్ల మార్కెట్ కమిటి చైర్మన్, పట్టణ తెరాస అధ్యక్షుడు కూడా అయన జిందం చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డులున్న మహిళలందరికీ బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినది తెలిసిందే. దీంతో భారీగా ఈ చీరల ఉత్పత్తుల ఆర్డర్లను సిరిసిల్ల పవర్‌లూం మ్యాక్స్ సొసైటీలు అందుకున్నాయ.

చిత్రం..తెల్ల రేషన్ కార్డున్న మహిళలకు పంపిణీచేసే బతుకమ్మ చీరలు