బిజినెస్

జిఎస్‌టిలో సెస్సు పెంపుపై ఆటో సంస్థల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో లగ్జరీ, ఎస్‌యువి, పెద్ద కార్లపై సెస్సును పెంచడంపట్ల లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జెఎల్‌ఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 21వ సమావేశంలో మధ్యశ్రేణి, భారీ కార్లు, ఎస్‌యువిలపై సెస్సును 7 శాతం వరకు పెంచుతున్నట్లు నిర్ణ యం తీసుకున్నారు. తాజా నిర్ణయం తో మధ్యశ్రేణి కార్లపై 2 శాతం, పెద్ద కార్లపై 5 శాతం, స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్స్ (ఎస్‌యువిలు)పై 7 శాతం చొప్పున సెస్సు పెరిగింది. దీంతో ఆటో రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని, కార్ల ధరలు పెరగడానికి దోహదం చేస్తుందని, అదే జరిగితే అమ్మకాలు పడిపోవడం ఖాయమన్న ఆందోళనను దేశ, విదేశీ ఆటో రంగ సంస్థలు వెలిబుచ్చాయి. కాగా, గతంలో ఆమోదించిన రేట్ల ప్రకారం చూస్తే 1,500 సిసి సామర్థ్యానికి మించిన ఇంజిన్లున్న పెద్ద కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న ఎస్‌యువిలపై జిఎస్‌టిలో విధించిన గరిష్ఠ పన్ను రేటు 28 శాతానికి అదనంగా మరో 15 శాతం సెస్సు పడుతుంది. తాజా నిర్ణయంతో దీనికి మరో 7 శాతం తోడవుతోంది. దీంతో మొత్తం 50 శాతానికి చేరుతోంది. కాగా, చిన్న, హైబ్రిడ్ వాహనాలపై సెస్సు జోలికి కౌన్సిల్ వెళ్లలేదు. దీంతో వాటి ధరల్లో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చంటున్న ఆటో రంగ సంస్థలు.. మధ్య, పెద్ద, ఎస్‌యువిల ధరలే పెరగవచ్చన్న సంకేతాలనిస్తున్నాయి. నిజానికి జిఎస్‌టి రాకతో పన్నులు తగ్గడంతో కార్ల ధరలను ఆటో సంస్థలు తగ్గించినది తెలిసిందే. అయితే సెస్సు పెరగడంతో అవి మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానం (జిఎస్‌టి)లో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సై జ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమం లోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై గరిష్ఠ పన్ను 28 శాతం కాకుండా, మరో 15 శాతం వర కు అదనపు భారాన్ని సెస్సు రూపం లో మోపింది మోదీ సర్కారు. అది 43 శాతానికి చేరగా, మధ్యశ్రేణి, భారీ కార్లు, ఎస్‌యువిలపై తాజాగా పెంచి న 7 శాతంతో 50 శాతానికి చేరింది.