బిజినెస్

చైనాకు ఎగుమతులు పెంచేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ద్వైపాక్షిక ఎగుమతుల పురోగతికి భారత్-చైనాలు నడుం బిగించాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును పూడ్చేలా పారిశ్రామిక క్రీయశీలక బృందాల ఏర్పాటుకు అంగీకరించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. చైనాతో భారత్ వాణిజ్య లోటు అంతకంతకూ పెరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన చైనాకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఇండస్ట్రీ స్పెసిఫిక్ వర్కింగ్ గ్రూప్స్ అని ట్విట్టర్ ద్వారా వివరించారు. తూర్పు ఆసియా దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు హాజరయ్యేందుకు తాను మనీలా వచ్చానన్నారు.