బిజినెస్

పొగాకు రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 14: పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభు త్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం మంత్రి త్రోవగుంట, ఒంగోలు-2, టంగుటూరు పొగాకు వేలం కేంద్రాలను సందర్శించారు. అక్కడ పొగాకు బేళ్లను పరిశీలించారు. పొగాకు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు చుండూరి రంగారావు, అధ్యక్షుడు చుంచు శేషయ్య మాట్లాడుతూ పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకుకు సరాసరిన 125 నుండి 128 రూపాయల వరకు ధర లభిస్తుందన్నారు. అయతే పొగాకు ఖర్చుల ప్రాతిపదికన గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పొగాకు సాగుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేనిపక్షంలో పొగాకు బోర్డులో నమోదు అయిన రైతుల ఒక్కొక్క బ్యారన్‌కు ఎనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రత్తిపాటి మాట్లాడుతూ రైతులను కాపాడుకుంటేనే పొగాకు పరిశ్రమ బాగుంటుందన్నారు. నిరుడు ధరలు లేక రైతులు నష్టాల్లో ఉంటే, కిలోకు కేంద్ర ప్రభుత్వం 15 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయల చొప్పున బోనస్ చెల్లించామని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా ధర సక్రమంగా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సిగరెట్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు పూర్తిస్థాయిలో పొగాకును కొనుగోలు చేయడం లేదని, ధరలు ఎక్కువగా రాకుండా వారంతా కలిసి సిండికేట్ అవుతున్నారన్నారు. సిండికేట్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిగరెట్ తయారీదారులు, ఎగుమతిదారులు పుర్రె గుర్తు కుంటిసాకు చూపి తక్కువ ధరకు పొగాకును కొనుగోలు చేయడం సరైంది కాదన్నారు. త్వరలో రైతు నాయకులను ఢిల్లీకి తీసుకెళతామని, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై పొగాకు రైతులకు మంచి ధర వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేజి పొగాకుకు పది రూపాయలు అదనంగా చెల్లించే లా వ్యాపారులతో మాట్లాడతామన్న మంత్రి కొనుగోళ్లు వీలైనంత త్వరగా పూర్తికావాలని సూచించారు.