బిజినెస్

సేంద్రీయ సేద్యానికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: సేంద్రీయ విధానంలో ఉద్యాన పంటలు పండించేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. సేంద్రీయ సేద్యంపై మంగళవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సేంద్రీయ విధానంలో సేద్యం చేసే రైతులకు తక్కువ ధరకే సేంద్రీయ ఎరువు ‘వేస్ట్ డీకంపోజర్’ను అందిస్తామన్నారు. ఘజియాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్న డీకంపోజర్ ఒక బాటిల్‌ను 20 రూపాయలకే విక్రయిస్తారన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు హైదరాబాద్‌లోని కేంద్రీయ కిసాన్ సేవా కేంద్రం (416/ఎ, బాబుఖాన్ ఎస్టేట్)లో సంప్రదించవచ్చన్నారు. ఫోన్‌లో 040-2323 5858లో కూడా ఇందుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించవచ్చని వివరించారు. సేంద్రీయ విధానంలో సాగు చేసే పంటలకు సంబంధించి రైతులు స్వయంగా ‘స్వీయ ధృవీకరణ విధానం’ అమలు చేసేందుకు వీలుందన్నారు. మూడేళ్లుగా సేంద్రీయ ఎరువులు వాడిన తర్వాత సేంద్రీయ ఆహార ఉత్పత్తుల పేరుతో పంటలను విక్రయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.