బిజినెస్

అక్టోబర్ 1 నుంచి సరళీకృత ఎగుమతుల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 12: సరళీకరించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిబంధనలకు అనుగుణంగా వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎగుమతిదారులు తమ సరుకులను మరింత సులువుగా ఎగుమతి చేసుకునేందుకు నూతన విధానం అమలు చేయనున్నట్టు కస్టమ్స్ కమిషనర్ సుధా కోకా వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో మంగళవారం సుధా కోకా విలేఖర్లతో మాట్లాడారు. ఎగుమతిదారులు తమ కంటైనర్లను సెల్ఫ్ సీలింగ్ చేసుకుని, ఎగుమతి చేసుకోవడానికి ఈ విధానం ద్వారా అనుమతి లభిస్తుందన్నారు. దీనికి సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణను ఉపసంహరించామన్నారు.
సరుకుల ఎగుమతి కోసం సరళీకృత సీలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓ ప్రత్యేక సంఖ్యను కలిగివున్న ప్రామాణిక వివరణ (ఒక సమయం బోల్డ్‌సీల్)ను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఎగుమతిదారులు వారి స్వంత వ్యయంతో విక్రేతల నుండి సీల్‌ను పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్, కస్టమ్స్ అధికారులు కంటైనర్‌ను ట్రాక్ చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. గతంలో ఫ్యాక్టరీ ప్రాంగణంలో స్వయం సీలింగ్ సదుపాయాన్ని ఎగుమతిదారులు పొందిన పక్షంలో తాజాగా కస్టమ్స్ అధికారుల అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనుమతి తీసుకున్న వాటిలో ఏదైనా మార్పులుంటే మాత్రం తాజాగా అనుమతి తీసుకోవల్సి ఉంటుందన్నారు.
ఆన్‌లైన్‌లో షిఫ్టింగ్ బిల్స్ ఫైల్ చేసే సమయంలో ఈ-ముద్ర క్రమసంఖ్యను కూడా ఎగుమతి చేయాలని స్పష్టం చేశారు. విజయవాడలోని సిపిసి నుండి ఒకసారి అనుమతి పొందిన తరువాత జిఎస్‌టిలో నమోదు చేసుకున్న ఎగుమతిదారులు స్వీయ సీలింగ్ విధానాలకు అర్హులని ప్రకటించారు.
ఈ అనుమతి శాశ్వతమైనదని, దేశంలోని అన్ని పోర్టుల నుండి ఎగుమతులకు ఈ అనుమతిని వినియోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోనైతే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే ఎగుమతి ఫెసిలిటేషన్ అధికారికి దరఖాస్తు చేయాలని సుధా కోకా పేర్కొన్నారు. సమావేశంలో కస్టమ్స్ వింగ్ అదనపు కమిషనర్ కెబి రాజు, జాయింట్ కమినర్ ఎస్ నరసింహారెడ్డి, డిప్యూటీ కమిషనర్ బికె సింగ్, అసిస్టెంట్ కమిషనర్ రవిశంకర్ మిత్రా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కస్టమ్స్ కమిషనర్ సుధా కోకా