బిజినెస్

విజృంభించిన రిటైల్ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో విజృంభించింది. ఆగస్టులో 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 3.36 శాతంగా నమోదైంది. మార్చి తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. నాడు 3.89 శాతంగా ఉంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ఈ రిటైల్ ద్రవ్యోల్బణం నిరుడు ఆగస్టులోనైతే 2.36 శాతంగానే ఉంది. కాగా, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో చిల్లర ద్రవ్యోల్బణం రెక్కలు తొడిగింది. ఆహార ద్రవ్యోల్బణం ఈ ఆగస్టులో 1.52 శాతంగా ఉందని మంగళవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. తయారైన భోజనం, స్నాక్స్, స్వీట్స్ తదితర ఆహారోత్పత్తులు ప్రియమైయ్యాయి. అయితే తృణధాన్యాలు, మాంసం, చేపలు, వంటనూనెలు, కొవ్వు పదార్థాల ధరలు దిగివచ్చాయి. అయితే కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో చిల్లర ద్రవ్యోల్బణం ఎగబాకింది. పెరిగిన రవాణా వ్యయం కూడా ద్రవ్యోల్బణం ఎగిసిపడటానికి ఓ ముఖ్య కారణంగా నిలుస్తోంది. కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వీటి ప్రభావం రాబోయే రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలపై సహజంగానే ఉండనుంది. రిటైల్‌తోపాటు, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగితే వడ్డీరేట్లలో ఆర్‌బిఐ మార్పులు చేయవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.