బిజినెస్

ఆర్థిక ఇబ్బందుల్లో 108 వాహనాల సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: రోడ్లపై లేదా ఎక్కడైనా ఎటువంటి ప్రమాదం జరిగినా కుయ్, కుయ్‌మంటూ దూసుకెళ్ళే 108 వాహనాల సిబ్బంది పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటున్న ఉద్యోగుల వెతలు చెప్పలేనంతగా ఉన్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ గగనమైపోతోంది. ఇంటి అద్దెలు, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ఈ రోజుల్లో 10 వేల లోపు జీతాలతో కాలం వెల్లదీస్తున్నారు మరి. 2005 సంవత్సరం ఆగస్టు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్భాటంగా 108 వాహనాలను తీసుకుని వచ్చారు. 2009 ఎన్నికల సమయంలోనూ వైఎస్ ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తూ ఎక్కడ ప్రమాదం జరిగినా కుయ్, కుయ్‌మంటూ వాహనాలు వచ్చేస్తున్నాయంటూ చెప్పగానే సభికులు కరతాళధ్వనులు చేసేవారు. ఆ వాహనాలు నేటికీ రోడ్లపై కుయ్, కుయ్‌మంటూ దూసుకెళుతున్నాయి. కానీ అందులో పనిచేసే వారి జీవితాలే దారుణంగా ఉన్నాయని 108 వాహనాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు పల్లె అశోక్ సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, కర్నాటక, గుజరాత్, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో జివికె అధ్వర్యంలో 108 వాహనాలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. 10 నుంచి 12 వేల లోపు జీతాలు సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ఆయన వివరించారు. నిజానికి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 16 వేల రూపాయలు చెల్లించాలని అన్నారు. పదేళ్ళుగా పని చేస్తున్న సీనియర్లకు కనీసం 18 నుంచి 20 వేల రూపాయలు చెల్లించాలని తాము చాలా కాలంగా కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, వినయ్ భాస్కర్ నేతృత్వంలో నియమించిన కమిటీ తమకు అనుకూలంగా అనేక సిఫార్సులు చేసినా, అవీ అమలుకు నోచుకోలేదని ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. తెలంగాణలో 316 వాహనాలు ఉన్నాయని, ఇంకా 11 వాహనాలు స్టాండ్‌బై ఉంటాయని ఆయన తెలిపారు. అంటే ఎక్కడైనా 108 వాహనం చెడిపోతే అక్కడికి స్టాండ్‌బై వాహనం చేరుకుంటుందన్నారు. మొత్తం 1,750 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ కల్పించుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.