బిజినెస్
పెరిగిన టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 September 2017
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెలలో 9 శాతం పెరిగాయి. ఆగస్టులో 94,201 యూనిట్లుగా ఉన్నట్లు మంగళవారం సంస్థ తెలిపింది. నిరుడు ఆగస్టులో 86,288 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో అమ్మకాలు గతంతో పోల్చితే 56,104 యూనిట్ల నుంచి 58,858 యూనిట్లకు పెరగగా, వాణిజ్య వాహన విభాగంలో విక్రయాలు 30,184 యూనిట్ల నుంచి 35,352 యూనిట్లకు ఎగిశాయి. సంస్థ లగ్జరీ బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాలు 5 శాతం పెరిగాయి.