బిజినెస్

చివర్లో కొనుగోళ్ల హుషారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు ఏడాదిన్నర కాలం తర్వాత పెరిగినప్పటికీ పట్టించుకోని మదుపరులు.. పెట్టుబడులకే ఆసక్తి కనబరిచారు. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కొనసాగిన సూచీలు.. మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివర్లో తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 163.66 పాయింట్లు పుంజుకుని 25,653.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45.85 పాయింట్లు అందుకుని 7,860.75 వద్ద స్థిరపడింది.
ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, మెటల్, ఐటి, ఆటో, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఆయా రంగాల షేర్ల విలువ 1.58 శాతం నుంచి 0.49 శాతం వరకు పెరిగింది. అయితే చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, ఈ రంగాల షేర్ల విలువ 0.41 శాతం నుంచి 0.32 శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా స్టాక్ మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.04 శాతం నుంచి 0.84 శాతం మేర పెరిగాయి. అయితే ఐరోపా స్టాక్ మార్కెట్లలో మాత్రం ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లు 0.23 శాతం, 0.79 శాతం చొప్పున నష్టపోయాయి.
26 వేల స్థాయికి సెనె్సక్స్: హెచ్‌ఎస్‌బిసి అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 26,000 స్థాయికి చేరుకుంటుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. ఇంతకుముందు 25,000 స్థాయి వద్దే ఉండొచ్చని అంచనా వేసిందీ ఆర్థిక సేవల దిగ్గజం. స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది ఆరంభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనది తెలిసిందే. తిరిగి ఈ మధ్యే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో అంతకుముందు వేసిన అంచనాను హెచ్‌ఎస్‌బిసి సవరించింది.
కాగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా గమనిస్తే సెనె్సక్స్ 627.97 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 25,653.23 పాయింట్ల వద్ద ఉండగా, ఈ జనవరి 1న 26,160.90 వద్ద ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం జనవరి 1న 7,963.20 వద్ద ఉంటే, ఇప్పుడు 7,860.75 వద్ద ఉంది. 100 పాయింట్లకుపైగా నష్టపోయింది. కాగా, రాబోయే రోజుల్లో ఐటి రంగం షేర్ల కొనుగోళ్లకు మదుపరులు అమితాసక్తిని ప్రదర్శిస్తారని హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. పారిశ్రామిక, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో పెట్టుబడులకు తక్కువగా ఆసక్తి చూపిస్తారని అభిప్రాయపడింది.