బిజినెస్

ల్యాండ్ ఫోన్ వినియోగదారులకు బిఎస్‌ఎన్‌ఎల్ తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలోని బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ వినియోగదారులు రాత్రీ పగలు తేడాలేకుండా కేవలం 390 రూపాయల నెలవారీ అద్దెతో ఆంధ్ర, తెలంగాణలోని ల్యాండ్‌లైన్ ఫోన్లతో పాటు ఇతర నెట్‌వర్క్‌ల సెల్‌ఫోన్‌లకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం లభించింది. ఈ కొత్త పథకాన్ని టెలికాం ఎపి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ కె దామోదరరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాత్రి వేళల్లో కేవలం బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్‌కు మాత్రమే ఉచితంగా మాట్లాడే అవకాశం ఉండేదన్నారు. సోమవారం రాత్రి నుంచి రాత్రీ పగలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో తమ ల్యాండ్‌లైన్ ఫోన్లతో పాటు ఇతర నెట్‌వర్క్‌ల సెల్‌ఫోన్లకు కూడా ఉచితంగా మాట్లాడవచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.50 లక్షల ల్యాండ్‌ఫోన్ కనెక్షన్లు, 65 లక్షల సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. సెల్‌ఫోన్లలో బిఎస్‌ఎన్‌ఎల్ నాలుగో స్థానంలో ఉందన్నారు. ల్యాండ్‌ఫోన్ల వినియోగం కొంతమేర తగ్గుతున్న మాట వాస్తవమేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతినెలా ల్యాండ్‌ఫోన్ కనెక్షన్‌లు కొన్ని తొలగించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,300 సెల్ టవర్లు ఉన్నాయని, త్వరలో మరో 500 టవర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రజలకు సరైన అవగాహన లేకనే టవర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని, అయితే వీటివల్ల ఆరోగ్య హాని ఏమీ ఉండదన్నారు. ఎన్ని ఎక్కువగా టవర్లు ఉంటే చెవికి అంత దూరంగా సెల్‌ఫోన్ పెట్టి మాట్లాడే అవకాశం లభిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 2.500 కోట్ల రాబడి ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1400 కోట్ల ఆదాయం లభిస్తోందని ఆయన తెలిపారు. ఇక కేవలం రూ. 429 ప్లాన్ ఓచర్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో 180 రోజులు ఉచిత కాల్స్ సౌకర్యం కల్పిస్తారు. ఇతర నెట్‌వర్క్‌లకు మాత్రం 90 రోజుల ఉచిత కాల్స్ వర్తిస్తాయి. అలాగే 90 రోజుల పాటు రోజుకు ఒక జిబి డేటా ఉచితమన్నారు. వాయిస్ టారిఫ్ కింద ఉచిత కాల పరిమితి దాటిన తర్వాత ఏ నెట్‌వర్క్‌కు అయినా 50 పైసల చార్జీ ఉంటుందని దామోదరరావు వివరించారు. ఈ సమావేశంలో ఎపి సర్కిల్ జనరల్ మేనేజర్లు ఎం జాన్‌క్రిస్టోన్, జి నాగేశ్వరరావు, జి రవీంద్రనాథ్, పి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.