బిజినెస్

మార్కెట్లకు కొత్త ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, సెప్టెంబర్ 18: అమెరికా డాలర్ మారకం విలువతో రూపాయి మరింతగా బలపడటం, విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపించడంతో పాటు ద్రవ్య లభ్యత అపారంగా పెరగడంతో సోమవారం నాటు నిఫ్టీ కొత్తపుంతలు తొక్కింది. రికార్డు స్థాయిలో 10,153 పాయింట్లకు చేరుకుంది. అలాగే సెనె్సక్స్ కూడా 151 పాయింట్లు బలపడి గత ఆరు వారాల్లో కొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం అటు నిఫ్టీకి, ఇటు సెనె్సక్స్‌కు మరింత ఊతాన్నిచ్చింది. దాదాపు ఆసియా మార్కెట్లన్నీ భారీ లాభాలను ఆర్జించాయి. ఐరోపా యూనియన్ షేర్లు కూడా పుంజుకున్నాయి. వడ్డీ రేట్లపై ఈ వారంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటం ఈ సానుకూల వాతావరణానికి దారితీసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 67.70 పాయింట్లు అంటే 0.76 శాతం పుంజుకుని 10,153.10 పాయింట్లకు చేరుకుని కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఆగస్టు 1వ తేదీన సాధించిన రికార్డును నేటి సానుకూల లావాదేవీల నేపథ్యంలో అధిగమించింది. ఆగస్టు నుంచి ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజులో 151.15 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ సోమవారం లావాదేవీలు ముగిసే సమయానికి 32,508.06 పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు మంగళవారం తీసుకోబోయే నిర్ణయంపై మార్కెట్ వర్గాలు కొండంత ఆశ పెట్టుకున్నాయి. అయితే ఈ సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం కనిపిస్తోంది. దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ.125.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు కూడా రూ.418.86 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ రెండు పరిణామాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదం చేశాయి. నేటి లావాదేవీల్లో బజాజ్ ఆటో భారీగా లాభపడింది. అలాగే హిందుస్థాన్ లీవర్, లార్సన్ అంట్ టుబ్రో, కోలిండియా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటోకార్ప్ షేర్ల విలువ దాదాపు 2.77 శాతం మేర పెరిగాయి. అలాగే గృహోపకరణ ఎలక్ట్రానిక్స్ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ తొలి రోజే అద్భుతమైన ఫలితాలను సాధించింది. దీని షేరు విలువ 63.81 శాతానికి పెరిగి 2,892.80 రూపాయలకు చేరుకుంది.