బిజినెస్

నెలాఖరుకల్లా థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 19: ఈ నెలాఖరుకుకానీ, లేదా వచ్చే నెల ప్రారంభానికల్లా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంతగా బొగ్గు సరఫరాలు లభిస్తాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటున్నందున ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. గత నెల రోజులుగా బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల దేశంలో దాదాపు రెండు డజన్లకు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ కేంద్రాల ఆపరేటర్లే కారణమని గోయల్ అన్నారు. ‘విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలను పెంచడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొంటోంది. ఈ నెలాఖరుకల్లా లేదా వచ్చే నెల ప్రారంభానికి పరిస్థితి మెరుగవుతుంది’ అని మంగళవారం ఇక్కడ ఇండో-అమెరికన్ వాణిజ్య మండలి సమావేశంలో మంత్రి చెప్పారు. మండలి చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు మంత్రి ఈ విషయం చెప్పారు. 30-40 రోజుల బఫర్ నిల్వలుండాల్సి ఉండగా, దేశంలో చాలా థర్మల్ కేంద్రాల వద్ద రెండు మూడు రోజులకు మాత్రమే సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి అని శ్రీనివాసన్ చెప్పారు. కాగా,జలవిద్యుత్, అణు విద్యుత్, ఇతర మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి గత నెలలో గణనీయంగా తగ్గడం కూడా బొగ్గుకు డిమాండ్ భారీగా పెరగడానికి మరో కారణమని గోయల్ చెప్పారు. కాగా, రైల్వేలో వందశాతం విద్యుదీకరణ తన తొలి ప్రయారిటీ అని రైల్వే మంత్రి కూడా అయిన గోయల్ చెప్పారు. దీనివల్ల రైల్వేలు ప్రతి ఏటా డీజిల్‌పై చేస్తున్న 26 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన చెప్పారు.