బిజినెస్

అయోమయంలో నిర్మాణ రంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణ రంగంపై జిఎస్‌టి అమలు కారణంగా అటు వినియోగదారుడు, ఇటు బిల్డర్ అనవసర భారాన్ని మోయాల్సి వస్తోంది.
జిఎస్‌టి వలన నిర్మాణ వ్యయం
ఎస్‌ఎఫ్‌టికి 150 నుంచి 200 రూపాయలు పెరిగిపోయింది. జిఎస్‌టి రాక ముందు ప్లాట్ కొనుగోలు చేసిన మొత్తంలో ఎంత మొత్తాన్ని వైట్‌గా చూపిస్తారో, ఆ మొత్తానికి ఆరు శాతం ఫీజ్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది 12 శాతానికి పెరిగింది.

*కొనుగోలుదారునిపై పనె్నండు శాతం జిఎస్టీ
*‘గ్రీన్ టాక్స్’ అదనం
*వినియోగదారుడు, బిల్డర్‌పై అదనపు భారం
*ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌పై అవగాహన శూన్యం
*మూడేళ్ల వరకూ తేరుకోదంటున్న నిపుణులు
: జిఎస్‌టి దెబ్బకు నిర్మాణ రంగం కోలుకోలేని స్థితికి చేరుకుంది. పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన ఈ రంగంపై గోరుచుట్టుపై రోకటి పోటులా జిఎస్‌టి వచ్చిపడింది. నిర్మాణ రంగంపై జిఎస్‌టి అమల్లో ఉన్న లోపాలు కారణంగా అటు వినియోగదారుడు, ఇటు బిల్డర్ అనవసర భారాన్ని మోయాల్సి వస్తోంది. జిఎస్‌టి వలన నిర్మాణ వ్యయం ఎస్‌ఎఫ్‌టికి 150 నుంచి 200 రూపాయలు పెరిగిపోయింది. దీనికి తోడు గృహాలు కొనుగోలు చేసే వారు రిజిస్ట్రేషన్ సమయంలో 12 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి వస్తోంది. అంటే 50 లక్షల రూపాయలతో ఒక ప్లాట్ కొనుగోలు చేస్తే, కనీసం నాలుగున్నర లక్షల రూపాయలు వినియోగదారుడు జిఎస్‌టి కింద చెల్లించాల్సి వస్తోంది. దీంతో గృహాల కొనుగోళ్లు దారుణంగా తగ్గిపోయాయి.
బిల్డర్లపై అదనపు భారం
గతంలో బిల్డర్లు సిమెంట్, ఇసుక, ఇనుము వగైరా ముడి సరుకును సాధారణ పన్ను చెల్లించి, రప్పించుకునేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. సిమెంట్ కొనుగోలు చేస్తే అక్కడ 28 శాతం జిఎస్‌టి చెల్లించాలి. ఐరన్‌కు 28 శాతం, ఇసుకకు ఐదు శాతం జిఎస్‌టి చెల్లించాల్సి వస్తోంది. అలాగే తమ వద్ద పనిచేసే కూలీలకు నేరుగా నగదు చెల్లించే అవకాశం లేదు. వారికి ఇవ్వాల్సిన కూలీ మొత్తాన్ని చెక్ రూపంలో ఇవ్వాలి. ఇలా చెల్లించినందుకు కొంత జిఎస్‌టి చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కొత్తగా గ్రీన్ టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిఓ ఆంతర్యమేంటంటే, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు జరపకుండా ఉండేందుకు ప్రతి ఎస్‌ఎఫ్‌టికి మూడు రూపాయల గ్రీన్ టాక్స్ చెల్లించాలని ఆదేశించింది. అంటే ఒక బిల్డరు 20 వేల ఎస్‌ఎఫ్‌టితో అపార్ట్‌మెంట్ నిర్మిస్తే, 60 వేల రూపాయలు గ్రీన్ టాక్స్ కింద చెల్లించాలన్నమాట. వన్ నేషన్.. వన్ టాక్స్ అని జిఎస్‌టిని అమలు చేసిన తరువాత ఈ గ్రీన్ టాక్స్ ఎందుకు చెల్లించాలంటూ బిల్డర్లు లబోదిబోమంటున్నారు. ఇవన్నీ కలుపుకొంటే, ఒక ఎస్‌ఎఫ్‌టికి 150 నుంచి 200 రూపాయల వరకూ నిర్మాణ వ్యయం పెరిగింది. అంటే 1000 ఎస్‌ఎఫ్‌టి కలిగిన ఒక ప్లాట్‌ను కొన్న వ్యక్తి అదనంగా రెండు లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది కాకుండా 12 శాతం జిఎస్‌టి చెల్లించడంతో 1000 ఎస్‌ఎఫ్‌టి కలిగిన ప్లాట్‌పై కొనుగోలుదారుడు దాదాపూ నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నమాట.
ఇక ప్లాట్ కొనుగోలుదారుని విషయానికి వస్తే, జిఎస్‌టి రాక ముందు ప్లాట్ కొనుగోలు చేసిన మొత్తంలో ఎంత మొత్తాన్ని వైట్‌గా చూపిస్తారో, ఆ మొత్తానికి ఆరు శాతం ఫీజ్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది 12 శాతానికి పెరిగింది. ఈ పన్ను వసూలులో కూడా ఆశ్ఛర్యపోయే విషయం ఒకటి ఉంది. బిల్డరు ఎంత స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించాడో, ఆ స్థలాన్ని ఆ ప్లాట్ కొనుగోలు దార్లకు సమాన భాగాల్లో విభజిస్తాడు. ఇలా ఒక్కో కొనుగోలుదారునికి వచ్చిన స్థలం, దాని మార్కెట్ విలువను లెక్కకట్టి దానిపై కూడా జిఎస్‌టి విధిస్తున్నారు. అందువలన కొనుగోలుదారుడు 12 శాతం టాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ల్యాండ్ కాంపొనెంట్‌ను జీరో చేయాలని బిల్డర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన కొనుగోలుదారునిపై జిఎస్‌టి భారం కొంత వరకూ తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ రంగం కోలుకోవాలంటే, కనీసం మూడేళ్ళయినా పడుతుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాము, జిఎస్‌టి దెబ్బకు కుదేలైపోయే పరిస్థితి వచ్చిందని క్రిడాయ్ విశాఖ శాఖ ఉపాధ్యక్షుడు పి.కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ నిర్మించే స్థలంపై టాక్స్ వసూలు చేయద్దని క్రిడాయ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. జిఎస్‌టి సమీక్షపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇక సిమెంట్, ఐరన్, ఇసుక వగైరాలకు తాము ముందుగానే టాక్స్ చెల్లించాలి. అపార్ట్‌మెంట్ నిర్మాణం అయిపోయి, ప్లాట్‌లు అమ్మకం పూర్తయిన తర్వాత లెక్కలు చూసి బిల్డరు చెల్లించిన టాక్స్‌లను ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కింద ఇస్తామని చెబుతున్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని, ప్లాట్‌ల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించిన 12 శాతం జిఎస్‌టి మొత్తంతో సరి చూడాలి. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్, కొనుగోలుదారుడు చెల్లించిన 12 శాతం జిఎస్‌టి కన్నా ఎక్కువ వస్తే, ఆ మొత్తాన్ని ప్లాట్ కొనుగోలుదారులకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అయితే, ఈ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు బిల్డరు ప్రతినెలా రిటర్న్స్ వగైరాలను దాఖలు చేయాలి. ఇవి నిర్మాణ రంగంలోని పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సాధ్యమని, సాధారణ బిల్డర్లకు దీనిపై ఏమాత్రం అవగాహన లేదని కోటేశ్వరరావు అన్నారు. ఈ టాక్స్ క్రెడిట్ రాకపోతే, కొనుగోలుదారునికి ఏవిధంగా క్రెడిక్ మొత్తాన్ని చెల్లించగలమని ఆయన ప్రశ్నించారు.