బిజినెస్

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లా నౌరోజినగర్ సముదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశ రాజధాని ఢిల్లీలోని నౌరోజి నగర్‌లో ఏర్పాటు చేయబోయే వాణిజ్య సముదాయం ప్రాజెక్టును ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ రంగంలోని నేషనల్ బల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బిసిసి) బుధవారం తెలిపింది. ఢిల్లీలోని నౌరోజినగర్, నేతాజీ నగర్, సరోజినీ నగర్ కాలనీలను ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్‌బిసిసికి అప్పగించింది. నౌరోజినగర్ వాణిజ్య కేంద్రాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌గా అభివృద్ధి చేయడానికి ఇటీవలే తమకు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌నుంచి లైసెన్స్ లభించిందని ఎన్‌బిసిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ కుమార్ మిట్టల్ విలేఖరులకు తెలిపారు. వాణిజ్య సముదాయంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 12 కమర్షియల్ టవర్స్ ఉంటాయని ఆయన చెప్పారు. 2020 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లో 21 వరల్డ్ ట్రేడ్ సెంటర్లను అభివృద్ధి చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ లైసెన్సులు ఇచ్చింది. ప్రస్తుతం ముంబయి, బెంగళూరు, పుణె, నోయిడా, కొచ్చిలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. నౌరోజి నగర్‌లో త్వరలో రాబోతున్న వాణిజ్య సముదాయంలో నిర్మించబోయే 12 టవర్స్‌లో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఎన్‌బిసిసి ఈ ఏడాది జూన్‌లో అయిదు కంపెనీలు పిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌పిసిఎల్, సిడ్బి, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌లకు రూ.1100 కోట్లకు విక్రయించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులోని మరిన్ని కమర్షియల్ టవర్స్‌ను అమ్మకానికి పెట్టనున్నట్లు మిట్టల్ చెప్పారు.