బిజినెస్

ముంబయి హై సమీపంలో మరో చమురు క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల సంస్థ (ఒఎన్‌జిసి) అరేబియా సముద్రంలోని తన ప్రధాన ముంబయి హై చమురు క్షేత్రాలకు పశ్చిమంగా చెప్పుకోదగ్గ పరిమాణంలో చమురు నిల్వలను కొత్తగా కనుగొనిందని ఆ సంస ఉన్నతాధికారి చెప్పారు. ఈ డబ్ల్యుఓ-24-3 బావిలో దాదాపు 20 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. దేశంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన ముంబయి హైలో ప్రస్తుతం రోజుకు 2,05,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తున్నారు. కొత్తగా కనుగొన్న చమురు క్షేత్రం ద్వారా రెండేళ్లలోపే ఆ ఉత్పత్తికి మరింత అదనంగా చేరనుంది. మొత్తం తొమ్మిది జోన్‌లలో పరీక్షలను నిర్వహించామని, వీటన్నిటిలోని హైడ్రోకార్బన్‌లు ఉన్నట్లు తేలిందని, చివరి జోన్‌లో 3,300 బ్యారెళ్ల చమురు ప్రవహించిందని ఆయన చెప్పారు. ఈ క్షేత్రానికి సంబంధించి ఒఎన్‌జిసి తదుపరి అంచనాలను కొనసాగిస్తోందని, చమురు అనే్వషణ రంగం రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ హైడ్రోకార్బన్స్ (డిజిహెచ్)కు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆ అధికారి తెలిపారు. ముంబయి హైలో ఒఎన్‌జిసి చమురు ఉత్పత్తిని ప్రారంభించిన దాదాపు 50 ఏళ్లకు ఈ కొత్త చమురు క్షేత్రాన్ని కనుగొనడం గమనార్హం. దీంతో ఒఎన్‌జిసి ముందు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ సంవత్సరాలు ఈ బేసిన్‌లో ఉత్పత్తిని కొనసాగించడానికి వీలవుతుంది. కొత్తగా కనుగొన్న చమురు క్షేత్రం డబ్ల్యుఓ-16 చమురు క్షేత్రానికి దగ్గరగా ఉందని, అక్కడ కనుగొన్న చమురును ఉత్పత్తి ప్రాంతానికి తీసుకురావడానికి అక్కడి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చని కూడా ఆ అధికారి చెప్పారు.