బిజినెస్

నేడు స్టాక్ మార్కెట్లోకి మాట్రిమోనీ డాట్‌కామ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వధూవరుల వివాహ పరిచయ ఆన్‌లైన్ పోర్టల్స్‌ను నిర్వహించే మాట్రిమోనీ డాట్‌కామ్ షేర్లు గురువారంనుంచి దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్లయిన బిఎస్‌ఇ, ఎన్‌ఇలలో మదుపరులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంస్థ గత వారం తన తొలి పబ్లిక్ ఇష్యూను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నెల 11-13వరకు గడువులోగా రూ.500 కోట్ల విలువైన ఈ ఐపిఓ 4.44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ సంస్థాగత కొనుగోలుదారుల వాటా 1.88 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ కాగా సంస్థాగతేతర ఇనె్వస్టర్లకు చెందిన 41 శాతం, రిటైల్ ఇనె్వస్టర్ల వాటా 18.16 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఐపిఓ ప్రైస్‌బ్యాండ్‌ను ప్రతి షేరుకు రూ 983-985గా నిర్ణయించారు. మ్యాట్రిమోనీ డాట్‌కామ్ ‘్భరత్ మ్యాట్రిమోనీ’ పేరుతో తన ఆన్‌లైన్ వధూవరుల పరిచయ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

మరో ఏడాదిలో దేశంలో కొత్తగా వంద బిగ్‌బజార్ స్టోర్లు

జంషెడ్పూర్, సెప్టెంబర్ 20: ఫ్యూచర్ గ్రూపునకు చెందిన హైపర్ మార్కెట్ చైన్ బిగ్ బజార్, రాబోయే ఏడాది కాలంలో మరో వంద స్టోర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం 100 నగరాల్లో తమకు 300 స్టోర్లు ఉన్నాయని, మరో 12 నెలల్లో మరో వందకు పైగా స్టోర్లను ప్రారంభిస్తామని బిగ్ బజార్ వ్యాపార విభాగం (తూర్పు ప్రాంతం) హెడ్ మనీష్ అగర్వాల్ చెప్పారు. జంషెడ్పూర్‌లో బుధవారం బిగ్ బజార్ రెండో స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ స్టోర్‌తో కలుపుకొని జార్ఖండ్‌లో తమకు 8 స్టోర్లు ఉన్నాయని, త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని దుకాణాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.