బిజినెస్

ఖనిజాలుండే ఖజానా ఫుల్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆర్థిక సంవత్సరంలో వేలం వేయనున్న 54 ఖనిజ క్షేత్రాలద్వారా ఖనిజాలు సమృద్దిగా ఉండే రాష్ట్రాల ఖజానాకు 1.5 లక్షల కోట్ల రూపాయల రాబడి రానుందని కేంద్ర ఖనిజాల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ చెప్పారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఖనిజాలున్న 54 ఖనిజ క్షేత్రాలను వేలం వేయడం ద్వారా సంబంధిత రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రాబడి రావచ్చని భావిస్తున్నాం’ అని బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఇప్పటివరకు వేలం వేసిన 21 ఖనిజ క్షేత్రాల ద్వారా రాష్ట్రాలకు 73 వేల కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ఖనిజ క్షేత్రాల వేలంలో భాగంగా గత ఏడాది తొలి విడతగా 21 ఖనిజ క్షేత్రాలను వేలం వేయడం జరిగింది. 2016 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా చత్తీస్‌గఢ్‌లోని రెండు చిన్నపాటి సున్నపురాయి గనులను వేయడంతో ఈ ప్రక్రియ మొదలైంది. రాబోయే 50 ఏళ్ల కాలంలో ఈ రెండు గనులనుంచి ఆ రాష్ట్రానికి దాదాపు 18 కోట్ల రాబడి రావచ్చని అంచనా. అప్పటినుంచి ఇప్పటివరకు ఇనుప ఖనిజం, సున్నపురాయి, బంగారం, వజ్రాలు లాంటి ఖనిజాలున్న 21 ఖనిజ క్షేత్రాలను వేలం వేయడం జరిగింది. ఈ క్షేత్రాలనుంచి ఖనిజాలను తవ్వుకునే లీజ్ కాలం 50 సంవత్సరాలు. రాయల్టీ, జిల్లా మినరల్ ఫౌండేషన్, జాతీయ ఖనిజాల అనే్వషణ ట్రస్టులకు చెల్లించే విరాళాల రూపంలో రాబడి వస్తుంది. ఈ సంవత్సరం సున్నపురాయి, ఇనుప ఖనిజం బంగారం లాంటి ఖనిజాలున్న క్షేత్రాలను వేలం వేయనుండడంతో వేలంలో పాల్గొనేవారి సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. కాగా, కోల్ ఇండియా ఖనిజాల మైనింగ్‌లోకి ప్రవేశించడం గురించి అడగ్గా, ఎవరు ఈ రంగంలోకి ప్రవేశించినా తాము స్వాగతిస్తామని, ఎందుకంటే ఎంత ఎక్కువమంది పాల్గొంటే అంతగా పోటీ ఉంటుందని, దాని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, ఖనిజాల రంగానికి ప్రయోజనం కలుగుతుందని అరుణ్ కుమార్ చెప్పారు.