బిజినెస్

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్.. లక్ష్యానికి చాలా దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: స్వచ్ఛ భారత్ సాధనకు తీవ్ర అవరోధంగా నిలుస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై స్థానిక సంస్థలకు చిత్తశుద్ధి కరవవుతోంది. స్థానిక సంస్థలకు శిరోభారంగా మారిన ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న లక్ష్యం సాధనకు దూరంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక సంస్థల్లో ఘన వ్యర్థాల సమర్థ వినియోగంపై విస్తృత కసరత్తు జరిపిన ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా సమస్య పరిష్కారానికి పూనుకుంది. రాష్ట్రంలో ఆరు ప్రధాన నగరాల్లో 66 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి సాధ్యం కాలేదు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి రెండేళ్ళ కిందట ప్రభుత్వం నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి తొలిసారిగా విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం సహా తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కడప, తాడేపల్లిగూడెం పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి, విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించారు. తిరుపతిలో 16 మెగావాట్లు, విశాఖపట్నం, గుంటూరులో 15 మెగావాట్లు, నెల్లూరులో 10 మెగావాట్లు, కడప, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ఐదేసి మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ పట్టణాల్లో రోజుకు 4,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని, తద్వారా 66 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఆయా పట్టణాల్లో ప్రైవేటు సంస్థలకు స్థలాలను కేటాయించారు. ఇక్కడ వరకూ అంతా సవ్యంగానే జరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ల ఏర్పాటు మాత్రం సాధ్యం కాలేదు. పలు చోట్ల స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్లాంట్‌ల ఏర్పాటు సాధ్యం కాలేదు. విశాఖలో ఘన వ్యర్థాల నిర్వాహణ ప్లాంట్‌కు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని అవాంతరాలను అధిగమించి, విద్యుత్ ఉత్పాదన ప్లాంట్‌లు ప్రారంభమైతే రెండేళ్ళ నాటికి లక్ష్యం మేరకు 66 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.