బిజినెస్

మూడో రోజూ అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా మూడో రోజు కూడా స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లలో మార్పులుండవని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించినప్పటికీ ఈ ఏడాది చివరినాటికి ఉద్దీపక చర్యలను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేయడంతో త్వరలోనే వడ్డీ రేట్లు పెరగవచ్చన్న సంకేతాల కారణంగా మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరంభ ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు లాభాల బాటలో సాగినప్పటికీ ఆ తర్వాత బ్యాంకింగ్, ఆటోమొబైల్, చమురు రంగాల కంపెనీల షేర్లు కుదేలు కావడంతో మధ్యాహ్నానికల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు 300 పాయింట్ల మేర హెచ్చుతగ్గుల మధ్య ఊగిసిలాడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ చివరికి 30.47 పాయింట్లు నష్టపోయి 32,370.04 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో సెనె్సక్స్ 80 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకొంది కానీ, చివరి అరగంటలో కాస్త పుంజుకొంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 10,158.90-10,058.60 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరికి 19.25 పాయింట్ల నష్టంతో 10,121.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తర్వాత ఆసియా మార్కెట్లు కూడా కళ తప్పడంతో మదుపరులకు కష్టాలు మొదలైనాయి. ఐసిఐసిఐ బ్యాంక్ దాదాపు 2 శాతం నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్ షేరు కూడా బాగానే నష్టపోయింది. కోల్ ఇండియా, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్ కూడా 1 శాతానికి పైగానే పతనమైనాయి. కాగా, రెడ్డీ లాబ్స్ షేరు దాదాపు 7 శాతం లాభపడింది. టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్‌లాంటి ప్రధాన కంపెనీల షేర్లు లాభపడ్డంతో మార్కెట్ల పతనం కొంతమేరకే పరిమితమైంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు సైతం ప్రధాన సూచీల బాటలోనే సాగి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కాగా, డాలరుతో రూపాయి దాదాపు 2నెల కనిష్టస్థాయికి పతనం కావడం మార్కెట్ స్థితికి అద్దం పట్టింది.