బిజినెస్

సరైన సమయంలో సరైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సరైన సమయంలో సరైన చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం హామీ ఇచ్చారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోకపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. ఆర్థికాభివృద్ధిని గాటన పెట్టేందుకు మంత్రివర్గ సహచరులతో పాటు సీనియర్ అధికారులతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్న జైట్లీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే ఎంతో చురుకుగా పనిచేస్తోంది. ఆర్థికంగా ఎదురవుతున్న ఒడిదుడుకులను మేము విశే్లషిస్తున్నాం. వీటిని పరిష్కరించేందుకు సరైన సమయంలో తగిన చర్యలు చేపడతాం’ అని పెట్టుబడిదారుల సమావేశంలో జైట్లీ పేర్కొన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోవడం లేదన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూ, దీనిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టనున్న చర్యలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు విషయంలో రెండేళ్ల క్రితం మన దేశం చైనాను అధిగమించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వేగుచుక్కలా నిలుస్తుందని ఎంతో మంది నిపుణులు స్పష్టం చేశారు. అయితే 2016 ప్రారంభం నుంచి వరుసగా ఆరు త్రైమాసికాల్లో క్షీణించిన జిడిపి వృద్ధిరేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.7 శాతానికి దిగజారి మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో భారత్ తన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ (వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ) ట్యాగ్‌ను వరుసగా రెండో ఏడాది కూడా చైనాకు కోల్పోయింది. కేవలం జిడిపి క్షీణించడమే కాకుండా ఎగుమతుల విషయంలో మనకు బలమైన ఎదురుగాలులు వీస్తుండటం, పారిశ్రామిక వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమవడంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతా లోటు (విదేశీ మారకద్రవ్య రాక, పోక మధ్య అంతరం) 2.4 శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు)లను ప్రైవేటీకరించేందుకు మోదీ సర్కారు మరింత విస్తృతంగా కసరత్తు చేస్తోంది. పిఎస్‌యుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఈ ఏడాది నిర్ధేశించుకున్న లక్ష్యం చాలా పెద్దదని, ఈ పెట్టుబడుల ఉపసంసహరణ విషయంలో ముందడుగు వేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని జైట్లీ తెలిపారు. పిఎస్‌యుల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.46 వేల కోట్లు రాబట్టుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రూ.72.50 వేల కోట్లను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న విషయం తెలిసిందే.
కాగా, గత కొద్ది సంవత్సరాల్లో దేశ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగిందని, జిఎస్‌టిని అమలు చేయడం, సబ్సిడీలను తగ్గించుకోవడం వంటి కీలక అంశాలపై సైతం ప్రస్తుత ప్రభుత్వం వేగవంతంగా నిర్ణయాలను తీసుకుంటోందని జైట్లీ అన్నారు. జిఎస్‌టి అమలు అనంతరం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సమర్ధవంతంగా కట్టడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని వస్తువులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోందని, వీటిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉందని ఆయన చెప్పారు.