బిజినెస్

సిఎస్‌ఆర్ సేవలకు గుర్తింపుగా శ్రీసిటీకి జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 22: సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) రంగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలోని శ్రీసిటీ ఫౌండేషన్‌కు ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్‌సిఎస్‌ఆర్’ పురస్కారం లభించింది. బెంగళూరులో నేషనల్ సిఎస్‌ఆర్ లీడర్‌షిప్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మై బ్రైన్ ఇంటర్నేషనల్ సంచాలకులు అలిస్టెర్ స్క్ఫోల్డ్ చేతులగా శ్రీసిటీ ఫౌండేషన్ అధ్యక్షులు రమేష్ సుబ్రమణ్యం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అరుదైన పురస్కారం లభించినందుకు శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతానికి చెందిన సాంఘిక, ఆర్థిక పరిస్థితులను ఒక సెజ్ ఏ విధంగా ప్రభావితం చేసి ఆ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను ఎలా మెరుగు పరచగలదనేందుకు నిలువెత్తు నిదర్శనం శ్రీసిటి సెజ్ అని అన్నారు. శ్రీసిటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమగ్ర గ్రామాభివృద్ధి కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషదాయకం అన్నారు. దేశంలో సిఎస్‌ఆర్ రంగంలో మంచి సేవలందించే సంస్థలను, వ్యక్తులను ప్రోత్సాహించేందుకు ఏషియన్ కనె్ఫడరేషన్ ఆఫ్ బిజినెస్ సహకారంతో వార్షిక పురస్కారాలను అందిస్తుండడం అభినందనీయమన్నారు.

చిత్రం..అలిస్టెర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న శ్రీసిటీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం