బిజినెస్

13 జిల్లాల్లో అంధకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి అంధకారం అలముకుంది. విశాఖలోని హిందుజా పవర్ ప్లాంట్‌లో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో పాటు విండ్ పవర్ కూడా మొరాయించింది. వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావల్సిన 2000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిందుజా పవర్ ప్లాంట్, విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపోతోంది. దీంతో విటిపిఎస్, కృష్ణపట్నం తదితర థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తిని కొద్ది రోజులుగా నిలిపివేశారు. అనుకోని విధంగా 2000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో థర్మల్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల తరువాత థర్మల్ పవర్ ప్లాంట్‌లు పనిచేయడం ప్రారంభమయ్యాయి. విటిపిఎస్ నుంచి 600 మెగావాట్లు, కృష్ణపట్నం 800 మెగావాట్లు, హిందూజా నుంచి 500 మెగావాట్ల విద్యుత్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత అందుబాటులోకి వస్తుందని ఈపిడిసిఎల్ అధికారులు తెలిపారు.