బిజినెస్

బంగారు ఆభరణాల తయారీకి చేతులు కలిపిన ఎస్‌ఆర్‌ఎం, టైటాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: బంగారు ఆభరణాల తయారీలో పరిశోధనలు చేపట్టడానికి ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, టైటాన్ సంస్థలు చేతులు కలిపాయి. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రొ-వైస్ ఛాన్సలర్ డాక్టర్ నారాయణరావు అధ్యక్షతన శుక్రవారం అధ్యాపకులతో ఏర్పాటైన ఒక సమావేశంలో బంగారు ఆభరణాల తయారీలో చేపట్టవలసిన పరిశోధనల ప్రాధాన్యతను టైటాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంజయ రెనెవడ, ఆభరణాల విభాగం సాంకేతిక అధికారి సంతోష్ వివరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ, బంగారు ఆభరణాల తయారీ కోసం చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఇప్పటికే టైటాన్ ఆధ్వర్యంలో పరిశోధనలు కొనసాగిస్తోందని, దానికి అదనంగా అమరావతి క్యాంపస్‌లో కూడా ఆ తరహా పరిశోధనలు కొనసాగించడానికి యాజమాన్యం చర్యలు చేపట్టిందని తెలిపారు. తమ ఆకాంక్షకు అనుగుణంగానే టైటాన్ సంస్థ కూడా అమరావతిలో పరిశోధనలు చేపట్టడానికి అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
టైటాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంజయ రెనెవడ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బంగారు ఆభరణాల తయారీలో పరిశోధనల ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గి, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. బంగారు ఆభరణం మందం, సుదీర్ఘకాలం మెరుపు కోల్పోకుండా ఉండటం, ప్రయోగశాలల్లో తయారుచేసిన వజ్రాలు, సహజ సిద్ధంగా లభించిన వజ్రాలను సులభంగా గుర్తించే పరికరం తయారీ వంటి అంశాలపై పరిశోధనల ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాలను కరిగించడానికి ఉపయోగించే సైనేడ్‌కు ప్రత్యామ్నాయంగా మరొక రసాయనాన్ని కనుగొనే రీతిలో కూడా పరిశోధనలు అవసరమని సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యాపకులు పరిశోధనలపై తమ ఆసక్తిని వ్యక్తపరచగా, అందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని టిటాన్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.