బిజినెస్

మరో 3 డొల్ల కంపెనీలపై సెబీ కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: డొల్ల కంపెనీలపై కొరడా ఝళిపించిన మార్కెట్ రెగ్యులేటర్ సెబి 331 అనుమానిత డొల్ల కంపెనీల జాబితాలోని మూడు కంపెనీలు-ఇండియన్ ఇన్ఫోటెక్ అండ్ సాఫ్ట్‌వేర్, న్యూఎవర్ ట్రేడ్‌వింగ్స్, శివమ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీల లెక్కలను క్షుణ్ణంగా ఆడిట్ చేయాలని ఆదేశించింది. దీంతో కలిపి ఇప్పటివరకు సెబీ ఆడిటింగ్‌కు ఆదేశించిన మొత్తం కంపెనీల సంఖ్య 11కు చేరుకొంది. ఈ మూడు కంపెనీలు తమ లెక్కలు, నిధుల వ్యయానికి సంబంధించి తప్పుడు వివరాలు చూపించినట్లు ప్రాథమికంగా తగిన సాక్ష్యాధారాలుకనిపించాయని, అందువల్ల ఏ మేరకు అవకతవకలు జరిగాయో తెలుసుకోవడానికి పూర్తిస్థాయి ఆడిట్ జరిపించాల్సిన అవసరం ఉందని గురువారం జారీ చేసిన మూడు వేర్వేరు ఉత్తర్వుల్లో సెబి పేర్కొంది. అవకతవకలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం ఒక స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలని సంబంధిత ఎక్స్‌చేంజిని సెబి ఆదేశించింది. అంతేకాకుండా ఈ మూడు కంపెనీల సెక్యూరిటీల ట్రేడింగ్‌ను ఈ ఏడాది ఆగస్టు 7న సెబి లేఖ జారీ చేయడానికి ముందు ఏ స్థితిలో ఉండిందో ఆ స్థాయికి తీసుకు రావాలని కూడా సంబంధిత స్టాక్ ఎక్స్‌చేంజిలను ఆదేశించింది. అలాగే ఈ మూడు కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లు తమకు సంబణధించిన కంపెనీల సెక్యూరిటీలను మాత్రమే కొనుగోలు చేయవచ్చని, తమవద్ద ఉన్న షేర్లను అమ్మకం కోసం డిపాజిటరీలకు బదిలీ చేయడానికి అనుమతించకూడదని కూడా సెబి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఇంతకు ముందు స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు జరపడంపై నిషేధం విధించిన 244 కంపెనీలపై సెబి ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ కంపెనీలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రతికూల సాక్ష్యాధారాలు లభించనందున వీటిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సెబి తెలిపింది. ఇప్పటికే నాలుగు దఫాలుగా 500కు పైగా కంపెనీలపై నిషేధాన్ని ఎత్తివేసిన సెబి తాజాగా ఇప్పుడు ఈ కంపెనీలపై నిషేధాన్ని ఎత్తివేయడం గమనార్హం. నిషేధం ఎత్తివేసిన కంపెనీల్లో రాడ్‌ఫోర్డ్ గ్లోబల్, పైన్ యానిమేషన్, ఫస్ట్‌ఫైనాన్షియల్, ఎకో ప్రెండ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఎస్టీమ్ బయో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, చానెల్ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌పిసి బయో సైనె్సస్‌లాంటివి ఉన్నాయి, పన్నుల ఎగవేత, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడడం కోసం ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేశాయన్న అనుమానంతో సెబి వీటిపై నిషేధం విధించింది.
వైశ్యా బ్యాంక్ మాజీ అధికారికి
రూ. 9 లక్షల జరిమానా
మరోవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐఎన్‌జి వైశ్యాబ్యాంక్ మాజీ అధికారి వినయ్ అగర్వాల్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబి రూ. 9 లక్షలు జరిమానా విధించింది. అగర్వాల్ 2011 ఆగస్టు నుంచి 2012 జూన్ 20 వరకు ఐఎన్‌జిలో బిజినెస్ బ్యాంకింగ్ ప్రాంతీయ అధికారిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2013 అక్టోబర్ 10 వరకు క్లస్టర్ బ్యాంకింగ్ బిజినెస్ రీజినల్ హెడ్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఐఎన్‌జి వైశ్యాబ్యాంక్ షేర్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై పరిశీలన జరిపిన సెబి నిబంధనలను ఉల్లంఘించినట్లు కనుగొనడంతో ఈ జరిమానా విధించింది.