బిజినెస్

ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రకటించాలనుకుంటున్న ఉద్దీపనల ప్యాకేజీ దేశంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిచ్చి, పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించేలా ఉండాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి.రంగరాజన్ ఉద్ఘాటించారు. అలాగే ప్రైవేటు రంగానికి మరిన్ని నిధులను సమకూర్చగలిగే విధంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకు (పిఎస్‌బి)లకు పెట్టుబడులను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన కేంద్రానికి సూచించారు. అసోచామ్ సమావేశం సందర్భంగా శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిరేటును సాధించాలంటే మిగిలిన మూడు త్రైమాసికాల్లో కనీసం 7 శాతం వృద్ధిని నమోదు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ విషయంలో రిజర్వు బ్యాంకు తగినన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు తగ్గి ఉండేవని ఆయన అన్నారు. ‘ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అట్టడుగు స్థాయికి దిగజారి 5.7 శాతంగా నమోదైన జిడిపి వృద్ధిరేటు ఇక నుంచి పుంజుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన దేశంలో మొత్తం మీద 6.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది నా వ్యక్తిగత అంచనా. ఈ అంచనానను అందుకోవాలంటే ఇక మిగిలిన మూడు త్రైమాసికాల్లో కనీసం 7 శాతం వృద్ధిరేటును సాధించాల్సిన అవసరం ఉంది’ అని రంగరాజన్ పేర్కొన్నారు.

చిత్రం..భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్