బిజినెస్

జియో ఫోన్లు వచ్చేస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రిలయన్స్ జియో ఫోన్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశీయ టెలికామ్ మార్కెట్‌లో గత ఏడాది పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ 4జి ఫోన్ల డెలివరీ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని, వినియోగదారులకు తొలి విడతలో పంపిణీ చేయదల్చుకున్న దాదాపు 60 లక్షల హ్యాండ్‌సెట్ల పంపిణీ 15 రోజుల్లో పూర్తవుతుందని ఆర్‌జెఐఎల్ (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్) భాగస్వామి ఒకరు వెల్లడించారు. డిజిటల్ రంగంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని జియో ఫోన్ తొలగిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. దీంతో గ్రామీణ, ప్రాంతాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లో ఆదివారం నుంచి ఈ ఫోన్ల డెలివరీ ప్రారంభమవుతుందని ఆర్‌జెఐఎల్ భాగస్వామి పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. 1500 రూపాయల ధరతో అమ్మనున్న ఈ హ్యాండ్‌సెట్లకు రూ.500 డిపాజిట్‌తో గత నెల 24వ తేదీ నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వీటిని బుక్ చేసుకున్న ఖాతాదారులు మిగిలిన 1000 రూపాయలను హ్యాండ్‌సెట్ డెలివరీ అయిన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఖాతాదారులు ఈ హ్యాండ్‌సెట్లను తిరిగి ఇచ్చేస్తే వారికి మొత్తం నగదును వాపసు ఇస్తారు.