బిజినెస్

ఒఎన్‌జిసి కార్పొరేట్ ఆఫీసుకు నేడు ప్రధాని ప్రారంభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇక్కడ కొత్తగా నిర్మించిన ఒఎన్‌జిసి కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాజీవ్ గాంధీ ఊర్జ్భావన్‌గా ఇప్పటివరకు ఉండిన ఈ భవనం పేరును ఇప్పుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఊర్జా భవన్‌గా నామకరణం చేశారు. దాదాపు ఆరువందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఏడాది క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఈ భవనంలో ఒఎన్‌జిసి, దాని అనుబంధ సంస్థ అయిన ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఏడాది పాటు ప్రభుత్వం నిర్వహించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ దీనదయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఒఎన్‌జిసి ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 2007 ఆగస్టు 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. అయితే 2016లో ఈ భవనం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకొన్నట్లు ఒఎన్‌జిసి గత ఫిబ్రవరిలో తెలిపింది. కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయాన్ని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలతో పాటుగా ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈ భవనంలోకి మార్చిన తర్వాత దీని పేరును మార్చాలనే నిర్ణయాన్ని తీసుకొన్నట్లు కంపెనీ తెలిపింది.