బిజినెస్

మరో ఆరు నెలలు ‘ఫేమ్’ రాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను తయారు చేస్తున్న పరిశ్రమలకు ‘ఫేమ్ ఇండియా’ (్ఫస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద అందజేస్తున్న ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం కనీసం మరో ఆరు నెలల పాటు కొనసాగించనుంది. దీంతో ఆయా పరిశ్రమలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు లేదా ఫేమ్ ఇండియా పథకం రెండవ దశను నీతి ఆయోగ్ ప్రారంభించే వరకు ఈ ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను తయారు చేస్తున్న సంస్థలకు ఫేమ్ ఇండియా పథకం కింద ప్రభుత్వం బైకులకు గరిష్టంగా రూ.29 వేలు, కార్లకు రూ.1.38 లక్షల చొప్పున రాయితీలు ఇచ్చి వాటిని తక్కువ ధరలో కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్న దేశంగా భారత్ ఆవిర్భవించాలన్న బృహత్తర లక్ష్యంతో చేపట్టిన ఫేమ్ ఇండియా పథకం అమలుకు సంబంధించిన ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందిస్తుంది. విద్యుత్, రోడ్డు రవాణా, భారీ పరిశ్రమలు తదితర మంత్రిత్వ శాఖలు సహా వివిధ ప్రభుత్వ విభాగాల సమష్టి కృషితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫేమ్ ఇండియా పథకం తొలి దశను ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమలు చేయాలని ఆరంభంలో భావించిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం విదితమే. అయితే ఇప్పుడు ఈ పథకం తొలి దశను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నామని, దీంతో దేశంలోని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన తయారీ సంస్థలకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు లేదా ఫేమ్ ఇండియా రెండవ దశను నీతి ఆయోగ్ ప్రారంభించే వరకూ రాయితీలు కొనసాగుతాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తమ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.