బిజినెస్

వృద్ధికి ఊతమిచ్చేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: తిరోగమన దిశలో పయనిస్తూ మూడేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రకటించాల్సిన ఉద్దీపనల ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పండుగల సీజన్‌లో వినియోగదారులకు మరింత నగదును అందుబాటులో ఉంచి వారి కొనుగోలు శక్తిని పెంపొందించడం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడం, దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల అభివృద్ధి, చౌక ధరలో చేపట్టే గృహనిర్మాణాలకు మరిన్ని నిధులు సమకూర్చడం వంటి విషయాలపై కేంద్రం దృష్టి సారించిందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చిట్కాలతో నివేదికను రూపొందించే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఏ) అరవింద్ సుబ్రమణియన్‌కు అప్పగించినట్లు వారు తెలిపారు. ద్రవ్య లభ్యత సరిగా లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అయితే గత ఆర్థిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3.5 శాతంగా ఉన్న బడ్జెట్ లోటును ఈ ఏడాది 3.2 శాతానికి తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని కుదించుకోవడంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై వత్తిడిని తగ్గించుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత నగదు అందుబాటులో ఉంచి వారి కొనుగోలు శక్తిని పెంపొందింపొందించేందుకు ప్రస్తుత పండుగల సీజన్ ప్రారంభం కావడానికి ముందే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న విషయం విధాన నిర్ణేతలకు తెలుసని, మరోవైపు ప్రజల వ్యక్తిగత వినిమయం తగ్గడంతో పన్ను రేట్లను తగ్గించాలని, లేదా పన్నుల పరిధిలోని ఆదాయ పరిమితులను పెంచాలని వస్తున్న ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా ఎవరి అభిప్రాయాలనూ తీసుకోలేదని అధికారులు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వలన దాదాపు 85 శాతం కరెన్సీ చెలామణిలో లేకుండా పోవడంతో పాటు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు వలన వేగవంతంగా క్షీణిస్తున్న దేశ వృద్ధిరేటు ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5.7 శాతానికి దిగజారి మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో గతంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న మన దేశం ఇప్పుడు జిడిపి వృద్ధిరేటు విషయంలో వరుసగా రెండో ఏడాది కూడా చైనా కంటే వెనుకబడింది. దీనికితోడు ప్రస్తుతం వనరులు పరిమితంగా ఉండటం, జిఎస్‌టి అమలు వలన తక్షణమే సానుకూల పవనాలు వీచే అవకాశాలు లేకపోవడంతో దేశంలో పెట్టుబడులకు ఊతమిచ్చి ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు.