బిజినెస్

వచ్చే వారమూ ఆటుపోట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: డెరివేటివ్‌ల గడువు ముగియనుండడం, అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన కారణంగా వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గత వారం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలుకావడంతో మదుపరుల గుండెల్లో గుబులు పెరగడం తెలిసిందే. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టాల్లో ముగిశాయి. ‘ఉత్తర కొరియా తన అణు పరీక్షలను హైడ్రోజన్ బాంబు స్థాయికి తీసుకెళ్లిన నేపథ్యంలో బుల్ ఆపరేటర్లు ఇప్పట్లో తిరిగి మార్కెట్లో కొనుగోళ్లకు దిగే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల ఆటుపోట్ల తీవ్రతను తగ్గించే సంకేతాలు కూడా కనుచూపుమేరలో కనిపించడం లేదు’ అని ఎపిక్ రిసెర్చ్ సంస్థ సిఈఓ ముస్త్ఫా నదీమ్ అభిప్రాయ పడ్డారు. ‘బలమైన సంస్కరణల అజెండా, నిలకడైన రాజకీయాల కారణంగా ఈ మధ్య గత కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లన్నిటిలోకి అద్భుతంగా రాణిస్తున్న మార్కెట్‌గా ఉంది. అయితే కార్పొరేట్ లాభాలు పెరగడం, లేదా ప్రస్తుతం ఆటుపోట్లకు గురవుతున్న అంతర్జాతీయ మార్కెట్లలో మామూలు పరిస్థితులు నెలకొంటే తప్ప ఇప్పుడున్న గరిష్ఠస్థాయిలు నిలకడగా కొనసాగే అవకాశాలు ఉండవు. ప్రస్తుతం డాలర్ల పెట్టుబడులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి గానీ రాబోయే త్రైమాసికాల్లో కార్పొరేట్ ఫలితాల్లో ఏవయినా ఇబ్బందులు ఎదురైతే ఈ రాకడలో ఇబ్బందులు తప్పవు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ స్పష్టం చేశారు.
గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. బిఎస్‌ఇ సెనె్సక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆగస్టు 11నుంచి ఇప్పటివరకు ఒక వారంలో సెనె్సక్స్ ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 121 పాయింట్ల మేర నష్టపోయింది. ‘కొరియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోయిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు రిస్క్ ధోరణిలోకి జారుకోవడంతో దేశీయ మార్కెట్లలో ప్రస్తుతం కొనసాగుతున్న బలహీన ధోరణి మరింత ఊపందుకొంది. సెప్టెంబర్ నెల ఫ్యూచర్స్, అప్షన్ల గడువు ముగిసే సమయం దగ్గరపడుతూ ఉండడం కూడా లిక్విడేషన్ ఒత్తిడికి తోడయింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయ పడ్డారు.