బిజినెస్

అరకు కాఫీకి అపారమైన గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 19: గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉందని, అయితే దానికి ఆస్థాయిలో ఉత్పత్తి మాత్రం లేదని, ఉత్పత్తి పెంచి కార్పొరేట్ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ వైస్-్ఛర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్‌పిఎస్ రవిప్రకాష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జిసిసి 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.183 కోట్ల వ్యాపారం అధిగమించిందని, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.367 కోట్ల వ్యాపారం లక్ష్యం దిశగా పయనిస్తోందన్నారు. జిసిసి మొత్తం 30 రకాల ఉత్పత్తులు మార్కెట్ చేస్తోందన్నారు. రాక్‌బి తేనె (పట్టు తేనె)ను ఉత్పత్తి చేసే సంస్థ భారతదేశంలో జిసిసి ఒక్కటేనని వివరించారు. అగ్‌మార్క్, ఆర్గానిక్ సర్ట్ఫికెట్ తమ సంస్థకే ఉన్నాయన్నారు. అరకు కాఫీకి అపారమైన డిమాండ్ ఉందని, లక్ష ఎకరాల్లో అరకు, తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయని చెప్పారు. ఎపెక్స్ కమిటీ ఆధ్వర్యంలో కాఫీ బోర్డు నిర్ణయించిన ధరల ప్రకారం గిరిజనులకు చెల్లింపులు చేస్తామన్నారు.
జిసిసికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 పెట్రోలు బంకులు ఉన్నాయని, వీటి ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్ సాగుతోందని రవిప్రకాష్ చెప్పారు. రానున్న కాలంలో మరో 10 పెట్రోలు బంకులు నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పన దిశగా జిసిసి కృషి చేస్తోందన్నారు. ఆయా ఉత్పత్తులు లభించే ప్రాంతాల్లో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రస్తుతం గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, చిత్తూరు, విజయనగరం, అరకు, పి మాడుగుల, రాజమహేంద్రవరంలో ఉన్నాయని రవిప్రకాష్ తెలిపారు.

చిత్రం విలేఖర్లతో మాట్లాడుతున్నజిసిసి మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రకాష్