బిజినెస్

సగం శాఖలు మూసేస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 19: భారత్‌లో తమ శాఖలను దాదాపు సగానికి సగం కుదించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు గురువారం ప్రకటించింది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ప్రత్యేకించి డిజిటల్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతుండటంతో స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య చేపడుతున్నామని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశంలోని 29 నగరాల్లో హెచ్‌ఎస్‌బిసికి 50 శాఖలున్నాయి. వీటిలో కోల్‌కతా, న్యూఢిల్లీ, విశాఖపట్నం, గౌహతి, ఇండోర్, జోధ్‌పూర్, లక్నో, లూధియానా, థానే, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, రాయ్‌పూర్, సూరత్, త్రివేండ్రం, వడోదర తదితర నగరాల్లో 24 శాఖలను మూసివేసి మిగిలిన 26 శాఖలను ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, గుర్గావ్, జైపూర్, కొచ్చి, కోల్‌కతా, నోయిడా, పుణె తదితర నగరాలకు పరిమితం చేయనున్నారు. పరిమితం చేయనున్నారు. దీని ఫలితంగా 300 మందికి పైగా హెచ్‌ఎస్‌బిసి సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్‌లో హెచ్‌ఎస్‌బిసికి సేవలు అందిస్తున్న మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు 33 వేలుగా ఉన్నందున స్థిరీకరణ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య 1 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ వలన నష్టపోయే తమ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది.