బిజినెస్

రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబి పి-నోట్స్ నిబంధనలను కఠినతరం చేస్తుందన్న భయాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న ఊహానాలతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 305 పాయింట్లు పతనమై రెండు వారాల నిష్ఠస్థాయి అయిన 25,399.72 పాయింట్లకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. డాలరుతో రూపాయి 37 పైసల మేర నష్టపోవడం ఊడా మార్కెట్ పతనానికి కారణమైంది. ప్రారంభంలో కొద్దిసేపు లాభాల్లో కొనసాగిన సెనె్సక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 25,351 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. చివరికి 304.89 పాయింట్ల నష్టంతో 25,399.72 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 86.75 పాయింట్లు నష్టపోయి 7,876.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయిదు రాష్ట్రాల ఎన్నిల ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉన్నప్పటికీ మార్కెట్‌పై దాని ప్రభావం కనిపించలేదు. సెనె్సక్స్ షేర్లలో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ షేరు అత్యధికంగా 6.14 శాతం పడిపోయింది. నష్టపోయిన ప్రధాన షేర్లలో ఎస్‌బిఐ, ఎల్‌అండ్‌టి, హెచ్‌డిఎఫ్‌సి, గెయిల్, ఐటిసి, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, రిల్, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్, ఎన్‌టిపిసి ఉన్నాయి. అయితే లుపిన్ షేర్లు మాత్రం 1.43 శాతం పెరిగాయి. కాగా, గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన పరాగ్ మిల్క్ ఫుడ్స్ షేర్లు తొలిరోజే 15 శాతం దాకా పెరిగి మదుపరులకు లాభాల పంట పండించాయి.