బిజినెస్

ఆ రైతు మాల్యాకు హామీదారట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిలిభిత్, మే 21: విజయ్ మాల్యా అంటే ఎవరో పాపం ఆ రైతుకు తెలియదు. అయినా సరే బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఎగవేయడంతో పాటుగా, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న మాల్యాకు ‘గ్యారంటీర్’గా నిలిచినందుకు ఆ రైతు బ్యాంక్ ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. మాల్యాకు గ్యారంటీర్‌గా నిలిచినందుకు మీ బ్యాంక్ ఖాతాలు రెండూ స్తంభింపజేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌లోని బిల్సందా పోలీసు స్టేషన్ పరిధిలోని ఖజురియా నవీరామ్ గ్రామానికి చెందిన 54 ఏళ్ల మన్మోహన్ సింగ్ అనే రైతుకు రెండు రోజుల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడా నాడ్ శాఖ తెలియజేసింది. ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు మేనేజర్ మంగేలాల్.. బ్యాంకులో ఉన్న మన్మోహన్ ఖాతాలు రెండింటినీ స్తంభింపజేశారు. ఒక ఖాతాలో 12 వేల రూపాయలుండగా, మరోదానిలో 4 వేల రూపాయలు ఉన్నాయి. అయితే మాల్యా గురించి కానీ, ఆయన కంపెనీ కింగ్ ఫిషర్ గురించిగానీ తనకు ఏమీ తెలియదని ఆ రైతు వాపోయాడు. అంతేకాదు తాను ముంబయి కానీ, చివరికి లక్నో కూడా చూడలేదని ఆయన అంటున్నాడు. రెండేళ్లక్రితం తాను 3 లక్షల రూపాయల రుణం తీసుకున్నానని, దానికోసం తన భూమికి సంబంధించిన వివరాలను బ్యాంక్‌కు ఇచ్చానని, అంతకు తప్ప తనకేమీ తెలియదని మన్మోహన్ చెప్పాడు. ఇదిలా ఉండగా, మన్మోహన్ బ్యాంక్ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని రీజినల్ కార్యాలయంనుంచి తనకు ఆదేశాలు వచ్చినట్లు బ్రాంచ్ మేనేజర్ మంగేలాల్ చెప్పారు.

చిత్రం రైతు మన్మోహన్ సింగ్