బిజినెస్

రూ.50వేల కోట్లతో కోస్టల్ కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 6: వ్యవసాయాధారిత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల స్థాపనతో సన్‌రైజ్ స్టేట్‌గా రూపకల్పన చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ధ్యేయమని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో శుక్రవారం రాయలసీమ, నెల్లూరు జిల్లాల పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాంతీయ సదస్సులో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్ని ప్రసంగించారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామన్నారు.రాష్ట్రంలో 970 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందని, త్వరలోనే కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ప్రకటించి 50వేల కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఏర్పాటుతో 50 వేల కోట్ల పెట్టుబడులతో ఈ జోన్ రూపుదిద్దుకోబోతోందన్నారు.

చిత్రం..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తున్న అమర్‌నాథ్ రెడ్డి