బిజినెస్

రేపటి నుంచి రెండు రోజులు సరుకుల రవాణా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: కేంద్రం అమలు చేస్తున్న జిఎస్‌టి విధానం, రోజువారీ డీజిల్ ధరల మార్పిడి, టోల్ టాక్స్‌లకు నిరసనగా ఈ నెల 9, 10 తేదీల్లో సరుకు రవాణా బుకింగ్, డెలివరీ బంద్ చేస్తున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.్భస్కర్‌రెడ్డి, జి.దుర్గాప్రసాద్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండు రోజులు సరుకు బుకింగ్, డెలివరి నిర్వహించవద్దని తెలిపారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్, ఆలిండియా ట్రాన్స్‌పోర్టు వెల్‌ఫేర్ అసోసియేషన్, సౌత్ ఇండియా ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. లారీల యజమానులంతా తమ నిర్ణయానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.