బిజినెస్

జిఎస్‌టి రేట్ల హేతుబద్ధీకరణ కొనసాగుతుంది : శుక్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను హేతుబద్ధీకరించే ప్రక్రియను జిఎస్‌టి కౌన్సిల్ కొనసాగిస్తుందని, వీటిలో 28 శాతంగా ఉన్న అత్యధిక పన్ను రేటు శ్లాబును క్రమంగా తగ్గించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా వెల్లడించారు. వస్తు, సేవల పన్నును 5 శాతం, 12 శాతం, 18, శాతం, 28 శాతం రేట్లతో నాలుగు శ్లాబులుగా విభజించిన ప్రభుత్వం, సామాన్య ప్రజలు విరివిగా ఉపయోగించే వస్తువులను జిఎస్‌టి నుంచి మినహాయించి విలాసవంతమైన వస్తువులతో పాటు అయోగ్యకరమైన వస్తువులను 28 శాతం పన్నురేటు శ్లాబులో చేర్చిన విషయం తెలిసిందే. అయితే వస్తు, సేవల పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు జిఎస్‌టి కౌన్సిల్ ఇప్పటికే గత కొంత కాలం నుంచి చర్యలను చేపడుతోదని, మున్ముందు కూడా ఈ ధోరణి కొనసాగుతుందని శుక్లా స్పష్టం చేశారు. అంతేకాకుండా జిఎస్‌టిలోని లొసుగులతో పాటు దాని అమలులో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ ఏడాది వ్యవధిలోగా తొలగిస్తామని ఆయన శుక్లా తెలిపినట్లు పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.

చిత్రం..శివ్ ప్రతాప్ శుక్లా