బిజినెస్

13న పెట్రోల్ బంకులు మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 7: పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకురావడంతో పాటు తమకు మరింత మార్జిన్ లభించేలా చర్యలు చేపట్టాలని, అలాగే చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న తమ ఇతర డిమాండ్లను పరిష్కరించాలని వత్తిడి తీసుకొచ్చేందుకు పెట్రోలియం డీలర్లు ఈ నెల 13వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నారు. దేశంలోని 54 వేల మందికిపైగా పెట్రోలియం డీలర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్ (యుపిఎఫ్) శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ డిమాండ్లను డిమాండ్లను త్వరగా పరిష్కరించకపోతే ఇంధన డీలర్లు ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధికంగా క్రయ, విక్రయాలను నిలిపివేయాల్సి ఉంటుందని యుపిఎఫ్ హెచ్చరించింది. తమ మార్జిన్‌ను ప్రతి ఆరు నెలలకోసారి పెంచాలని, వారి పెట్టుబడులకు మరింత లాభం వచ్చేలా చూడటంతో పాటు ఇంధన రవాణా, ఇథనాల్ బ్లెండింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని పెట్రోలియం డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్ల పరిష్కార విషయమై గత ఏడాది నవంబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చమురు మార్కెటింగ్ సంస్థ (ఓఎంసి)లు నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీంతో ఈ విషయమై వత్తిడి తీసుకొచ్చేందుకు 13న సమ్మె నిర్వహించబోతున్నామని యుపిఎఫ్ వెల్లడించింది. డిమాండ్ల పరిష్కార విషయమై తాము రాసిన లేఖలతో పాటు జూన్ 28వ తేదీన క్యాబినెట్ సెక్రటేరియట్ రాసిన లేఖను సైతం చమురు మార్కెటింగ్ సంస్థలు పట్టించుకోవడం లేదని యుపిఎఫ్ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను రోజు వారీగా సవరించడాన్ని కూడా డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. దీని వలన అటు వినియోగదారులకు గానీ, ఇటు తమకు గానీ మేలు జరగడం లేదని, కనుక ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో మాదిరిగా ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరించాలని, అలాగే పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని ఇంధన డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.