బిజినెస్

మార్కెట్లకు పి-నోట్స్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. పార్టిసిపేటరీ నోట్ల (పి-నోట్లు) నిబంధనలను కఠినతరం చేయడం మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బ తీసింది. పి-నోట్లలో పెట్టుబడులకున్న నిబంధనలను సెబీ కఠినం చేయడం వల్ల ఇకపై విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు ధారాళంగా రాకపోవచ్చన్న అంచనాలు దేశీయ మార్కెట్లను చుట్టుముట్టాయి. అంతేగాక వచ్చే నెలలో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చన్న ఆందోళనలూ మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 187.67 పాయింట్లు పతనమై 25,301.90 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 65.20 పాయింట్లు క్షీణించి 7,749.70 వద్ద నిలిచింది. నిజానికి అంతకుముందు వారం సూచీలు లాభాలను అందుకున్నది తెలిసిందే. సెనె్సక్స్ 261, నిఫ్టీ 81 పాయంట్లు లాభపడ్డాయ. అయతే అంతకుముందు వరుస రెండు వారాలు నష్టాలపాల య్యాయ. సెనె్సక్స్ 610 పాయంట్లు, నిఫ్టీ 166 పాయంట్ల మేర నష్టపోయాయ. అయినప్పటికీ గడచిన వారం మాత్రం ఆ జోష్‌ను నిలుపుకోలేకపోయాయి. ముఖ్యంగా గడచిన వారం ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ షేర్ల విలువ 7.32 శాతం పడిపోయింది. తమ ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ఎస్‌బిఐ.. ప్రభుత్వానికి ప్రతిపాదించడమే దీనికి కారణం. ఈ బ్యాంకుల ఆస్తులు, బకాయిలు మొత్తం కూడా ఎస్‌బిఐ పరిధిలోకే వెళ్లనున్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకులకున్న మొండి బకాయిల జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఎస్‌బిఐ.. ఈ బ్యాంకుల మొండి బకాయిల భారాన్ని కూడా మోయాల్సి వస్తుందన్న భయాలే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదానీ పోర్ట్స్, లుపిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, భారతీ ఎయర్‌టెల్, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్, బిహెచ్‌ఇఎల్, గెయల్ షేర్ల విలువ కూడా 5.60 శాతం నుంచి 2.65 శాతం వరకు దిగజారింది. ఇకపోతే గడచిన వారం విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 372.25 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.19 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.34 శాతం పడిపోయాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, టెక్నాలజీ, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 2.27 శాతం నుంచి 0.10 శాతం మేర పతనమైంది. నిర్మాణ రంగ షేర్ల విలువ మాత్రం 2.13 శాతం పెరిగింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 15,237.67 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 79,727.92 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 12,550.76 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 85,455.02 కోట్ల రూపాయలుగా ఉంది.

గడచిన వారం సెనె్సక్స్ ముఖచిత్రం