బిజినెస్

ఢిల్లీలో బాణాసంచా విక్రయంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఈసారి కూడా దేశ రాజధాని నగరంలో దీపావళి వెలుగులు కనిపించే అవకాశం లేదు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) పరిధిలో బాణాసంచా విక్రయాన్ని నిలిపివేస్తూ గత ఏడాది నవంబర్‌లో తీసుకున్న నిర్ణయాన్ని అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయించింది. న్యాయమూర్తి ఎ.కె.సిక్రీ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత నెల 12న ఈ నిషేధాన్ని నిలిపివేస్తూ, బాణాసంచా విక్రయాన్ని అనుమతిస్తూ తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం నవంబర్ 1నుంచి అమలులోకి వస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 19నే దీపావళి కావడం వల్ల, అంతకుముందే బాణాసంచా ఢిల్లీ ప్రాంతంలో అందుబాటులో ఉండదు. తాము గత నెల 12న జారీచేసిన ఉత్తర్వును మార్చడం లేదని, అయితే గత ఏడాది జారీచేసిన నిషేధ ఉత్తర్వును మాత్రం కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ బాణాసంచా వర్తకులు, వ్యాపారవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాత్కాలికంగా నిషేధం ఎత్తివేయడంతో జారీచేసిన బాణాసంచా విక్రయ లైసెన్సులను కూడా నిలిపివేయడం ఈ వర్తకులకు ఆశనిపాతంగా మారింది. బాణాసంచా కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం పరాకాష్టకు చేరుకున్న నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు నిషేధ ఉత్తర్వులు జారీచేసింది.